
సిల్ట్ తీయక పదిరోజులైంది
అప్పట్లో వారం రోజులకు ఒకసారైనా మోరీల్లో సిల్టు తీసేటోళ్లు. ఇప్పుడు పదిరోజులు దాటింది. వానలు పడుతున్నయి. మోరీలు సరిగా లేక దోమలు పెరిగినయి. వాడకట్టులో చాలా మందికి జ్వరాలు వస్తున్నయి. మోరీలు, రోడ్డుపై చెత్తను శుభ్రం చేయాలి.
– కొనవేణి కనకయ్య, ఆసిఫ్‌పుర, సిరిసిల్ల
ఇంటి ముందు దుర్వాసన
మావాడలో చెత్తను తీసుకొచ్చి మా ఇంటి ముందే పోస్తున్నారు. చెత్తడబ్బాలను ఇంకో చోట ఏర్పాటు చేసి వాటిలో పడేసేలా చూడాలి. చెత్తలో ఆహారం కోసం వీధికుక్కలు వచ్చి చిందరవందర చేస్తాయి. ఇంటి ముందే చెత్తకుప్ప కావడంతో ఒక్కటే దుర్వాసన వస్తుంది. మున్సిపాల్టోళ్లకు చెబితే సమస్య తీర్చడం లేదు.
– మూశం సువర్ణ, 37వ వార్డు, సిరిసిల్ల
ప్రణాళికతో పారిశుధ్య పనులు
పారిశుధ్య పనులు ప్రణాళిక బద్ధంగా జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇంటింటా చె త్తసేకరణ, వార్డుల్లో మోరీలు తీయిస్తున్నాం. కొంత సిబ్బంది కొరతతో ప్రతీ వార్డుకు టీం వర్క్ చేయిస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేశా ము. వర్షాకాలం ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతాం. ఫాగింగ్ మిషన్ తింపుతున్నాం. – పోసు వాణి, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్, సిరిసిల్ల

సిల్ట్ తీయక పదిరోజులైంది

సిల్ట్ తీయక పదిరోజులైంది