సిరిసిల్ల/సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలో శనివారం జరిగిన పదోతరగతి హిందీ పరీక్షకు 17 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. గీతానగర్ బాలికల జెడ్పీ హైస్కూల్, శివనగర్‌లోని కుసుమ రామయ్య హైస్కూల్‌లోని కేంద్రాలను ఎస్పీ మహేశ్ బీ.గీతే తనిఖీ చేశారు.
డీఈవో జనార్దన్‌రావు
హిందీ పరీక్షకు 17 మంది గైర్హాజరు