సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అందించే నిధులపై మంత్రి కేటీఆర్ నిజాలు మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు లగిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవా రం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. గ్రామాల్లో 15వ ఆర్థికసంఘం నిధులతోనే అభివృద్ధి జరుగుతో ందని గమనించాలన్నారు. జీపీలకు నిధులివ్వకుండా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బందుల కు గురిచేస్తోందన్నారు. ప్రతీగ్రామంలో కేంద్ర సర్కారు అందించే నిధులతోనే అభివృద్ధి పనులు సాగుతున్నాయని వీటిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మంత్రిస్థాయిలో కేటీఆర్ అబద్ధాలు మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆ వునూరి రమాకాంత్‌రావు మాట్లాడుతూ.. కరీంనగ ర్ ఎంపీ బండి సంజయ్ చొరవతోనే తెలంగాణకు కేంద్ర సర్కారు మెగా టెక్స్‌టైల్‌పార్కు ఆమోదం తె లిపిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బండి సంజయ్‌పై అవాక్కులు చవాక్కులు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోపి, పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, కౌన్సిలర్ భాస్కర్, కమలాకర్‌రావు పాల్గొన్నారు.