చెరువులను చెరబట్టీ.. | - | Sakshi
Sakshi News home page

చెరువులను చెరబట్టీ..

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

సింగరాయకొండ:

మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, కుంటలతో పాటు దేవదాయ భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. పాతసింగరాయకొండ, శానంపూడి, జరుగుమల్లి మండలం కే బిట్రగుంట ప్రాంతాల్లో ప్రతిరోజు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టి, గ్రావెల్‌ తరలిస్తున్నా అడ్డుకోవాల్సిన మైనింగ్‌, పోలీసు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్‌ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. ఇక్కడ తవ్విన గ్రావెల్‌ను పక్క మండలాలైన ఉలవపాడు, టంగుటూరు, కందుకూరు మండలాల్లోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు.

టిప్పర్‌కు రూ.10 వేలు

ఒక్కో టిప్పరును రూ.8 నుంచి రూ.10 వేలకు దూరాన్ని బట్టి అమ్ముతున్నారని ప్రతిరోజు భారీగా మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఈ అక్రమ దందా మొదలవుతుందన్నారు.

కె.బిట్రగుంట చెరువును వదల్లేదు..

బిట్రగుంట చెరువులో 20 రోజులుగా మట్టిని తవ్వుతూ టంగుటూరు మండలానికి తరలిస్తున్నారు. ఈ మట్టిని తరలించటానికి ట్రాక్టర్లు రాంగ్‌రూట్‌లో వస్తున్నా జరిమానా వేసిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.

యథేచ్ఛగా గ్రావెల్‌, మట్టి అక్రమ రవాణా

ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమ మైనింగ్‌

చెరువుల్లో అక్రమ తవ్వకాలు

అక్రమ మైనింగ్‌తో పాటు ఆక్రమణలో చెరువులు

భారీగా లబ్ధిపొందుతున్న ఇటుక బట్టీల వ్యాపారులు

ప్రభుత్వానికి, మైనింగ్‌ ఆదాయానికి భారీగా గండి

చోద్యం చూస్తున్న మైనింగ్‌, రెవెన్యూ,

ఇరిగేషన్‌, పోలీసు శాఖలు

అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట

వేయాలంటున్న ప్రజలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement