రోడ్డు ప్రమాదంలో జింక మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

అద్దంకి: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని జార్లపాలెం సమీపం రేణింగవరం రహదారిపై శనివారం జరిగింది. ఫారెస్ట్‌ బీట్‌ అధికారి రమేశ్‌ కథనం ప్రకారం.. జార్లపాలెం గ్రామ సమీపంలో ఒక జింక రోడ్డుపై పడి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ఫారెస్టు బీట్‌ అధికారి రమేశ్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి ఆయన జింక కళేబరాన్ని పరిశీలించి వివరాలు సమోదు చేసుకున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో జింక మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వాహనదారులు వేగ నియంత్రం పాటించాలన్నారు. వణ్యప్రాణులను ఢీకొట్టి చంపడం నేరమన్నారు. ఫారెస్ట్‌ చట్టం ప్రకారం వారు నేరస్తులవుతారని హెచ్చరించారు.

కుక్కల దాడిలో దుప్పి బలి

రాచర్ల: కుక్కలు దాడి చేయడంతో చుక్కల దుప్పి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రం రాచర్ల పెద్ద చెరువులో శనివారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాచర్ల పెద్ద చెరువులో నీరు తాగేందుకు వచ్చిన చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫారెస్టు సబ్‌ డీఎఫ్‌వో బాలరాజు, డీఆర్‌వో కృష్ణకుమారిలు సంఘటన స్థలానికి చేరుకుని దుప్పి కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక పశువైద్యాధికారి హరిబాబుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి శవపంచనామా చేశారు. ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ లక్ష్మనాయక్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement