వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన రేపు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన రేపు

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన రేపు డైట్‌ విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎస్‌ సర్వేపై అవగాహన వైభవంగా నారాయణస్వామి రథోత్సవం

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 15న కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను సందర్శించనున్నారని జిల్లా పార్టీ నాయకులు సోమవారం తెలిపారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని మత్స్యకారులందరూ హాజరు కావాలని కోరారు. ఉదయం 9.45 గంటలకు జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారని, 10.30 గంటలకు ఫిషింగ్‌ హార్బర్‌కు వస్తారన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ను పరిశీలించాక.. 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారన్నారు.

ఒంగోలు సిటీ:

దేశవ్యాప్తంగా చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎస్‌–2026 సర్వే జిల్లాలోని 15 పాఠశాలల్లో నిర్వహిస్తున్నారని, సర్వే నిర్వహణపై డైట్‌ విద్యార్థులకు (ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్స్‌)కు సోమవారం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. శాంపిల్‌ సర్వే ఎలా చేయాలి, డేటా సేకరణ విధానం ఎలా ఉండాలి అనే అంశాలపై సమగ్రంగా వివరించారు. ఈ సర్వేలో తెలుగు, ఇంగ్లిషు, గణితం వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్స్‌ ట్యాబ్‌లో నమోదు చేయనున్నారు. కార్యక్రమంలో డైట్‌ ప్రిన్సిపాల్‌ సామా సుబ్బారావు, డీసీఈబీ సెక్రటరీ శ్రీనివాసరావు, చీమకుర్తి ఎంఈఓ శివాజీ, ఏఎంఓ నాయక్‌, బాపట్ల ఏఎంఓ, ఒంగోలు ఎంఈఓ టి.కిషోర్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

సీఎస్‌పురం(పామూరు):

ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో నారాయణస్వామివారి రథోత్సవం సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారి మూల విగ్రహమూర్తికి అర్చకులు మంకాల శివప్రసాద్‌శర్మ అభిషేకం, విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆలయం చుట్టూ రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ గిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement