సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్థాయి జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపికలను సోమవారం మండలంలోని మైనంపాడు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఎంపికై న వారు ఈ నెల 16, 17, 18 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరగబోవు పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి సుందర రామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు వనజ రవికుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.


