నీటి సంరక్షణపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణపై దృష్టి సారించండి

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

నీటి సంరక్షణపై దృష్టి సారించండి పోక్సో కేసు నిందితునికి 14 రోజుల రిమాండ్‌

మార్కాపురం: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ విజయసునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని నీటిపారుదలశాఖ, ఉపాధి హామీ అధికారులు, ఎంపీడీఓలతో సోమవారం జలధార, జల హారతి కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. రెండు రోజుల్లో ప్రతి గ్రామంలో చేపట్టనున్న పనులపై నివేదిక ఇవ్వాలన్నారు. అదేవిధంగా జంగిల్‌ క్లియరెన్స్‌, పూడికతీత పనులు చేపట్టి నీటి సంరక్షణకు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, వెలుగొండ ప్రాజెక్టు ఎస్‌ఈ అబూద్‌ అలీమ్‌, నీటిపారుదలశాఖ ఈఈ భాస్కర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

సింగరాయకొండ: కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడి పోక్సో కేసు నమోదైన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం స్థానిక కోర్టు లో హాజరుపరచినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. జడ్జి డాక్టర్‌ వి.లీలా శ్యాంసుందరి నిందితునికి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement