చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గిద్దలూరు రూరల్‌: శరీరంపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టణంలోని అర్బన్‌ కాలనీకి చెందిన బొల్లాని పోలయ్య(60) భార్య అల్లూరమ్మతో ఘర్షణ పడుతూ మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 80 శాతం మేర శరీరం కాలిపోయిన పోలయ్యను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూల్‌కు తరలిస్తుండగా నంద్యాల సమీపంలో మృతి చెందాడు. పోలయ్యకు మొదటి భార్య రమణమ్మతో ముగ్గురు కుమారులు, రెండో భార్య అల్లూరమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొదటి భార్యతో 20 ఏళ్ల క్రితమే క్రితమే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తరువాత అల్లూరమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement