తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
కొత్తపట్నం: మండలంలోని మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ పి.రాజాబాబు శుక్రవారం పరిశీలించారు. టిడ్కో ఇళ్ల సమీపంలో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొక్లెయిన్ సహాయంతో కాలువలు తీసి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. టిడ్కో ఇళ్ల నుంచి కొత్తపట్నం బకింగ్‌హామ్ కెనాల్ వరకు రోడ్డును పరిశీలించారు. అక్కడక్కడా దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అల్లూరు నుంచి ఆలూరు వెళ్లే రోడ్డు మధ్యలో బ్రిడ్జి పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ శాంతి పాల్గొన్నారు.
ఈతముక్కల – ఒంగోలు రోడ్డుపై
భారీగా వరద నీరు...
కొత్తపట్నం మండలంలో ఈతముక్కల – ఒంగోలు మధ్యలో బకింగ్‌హామ్ కెనాల్ సమీపంలో సుమారు కిలోమీటరు మేర రోడ్డుపై భారీగా వరద నీరు చేరి అలాగే నిలిచి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒంగోలుకు రాకపోకలు నిలిచిపోవడంతో అవస్థపడుతున్నారు. రోడ్డుపై నుంచి వరద నీటిని పంపించాలని ప్రజలు కోరుతున్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్


