మెడికల్‌ కాలేజీలను కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీలను కాపాడుకోవాలి

Oct 26 2025 9:15 AM | Updated on Oct 26 2025 9:15 AM

మెడికల్‌ కాలేజీలను కాపాడుకోవాలి

మెడికల్‌ కాలేజీలను కాపాడుకోవాలి

మార్కాపురం టౌన్‌: గత వైఎస్సార్‌ సీపీ హయాంలో ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన 17 మెడికల్‌ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్సార్‌ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మార్కాపురంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలన్నింటినీ పూర్తిచేయకపోగా, వాటిని పీపీపీ విధానంలో వారికి అనుకూలమైన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి లబ్ధి పొందాలని చూడటం దురదృష్ణకరమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 28న మార్కాపురంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి సబ్‌ కలెక్టరు కార్యాలయంలో వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు 550 కోట్లు ఖర్చుపెట్టలేని ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారని ప్రశ్నించారు. మార్కాపురం, గిద్దలూరు, వై.పాలెం నియోజకవర్గాలతో పాటు అందరికీ ఉపయోగపడే మార్కాపురం మెడికల్‌ కాలేజీని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, ప్రజలపై ఉందన్నారు. ఈ కాలేజీ పూర్తయితే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య తక్కువ ఖర్చుతో అందుతుందని తెలిపారు. ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్తే లక్షలాది రూపాయల డొనేషన్లు చెల్లించి చదివించడంతో పాటు కార్పొరేట్‌ వైద్యాన్ని డబ్బులు చెల్లించి పొందాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. పీపీపీ విధానాన్ని వామపక్షపార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, జర్నలిస్టు సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నా కూటమి ప్రభుత్వం పీపీపీకే మొగ్గుచూపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజలంతా దీనిపై ఆలోచించాలన్నారు. వచ్చే నెల 25 తర్వాత రాష్ట్ర గవర్నర్‌ వద్ద అపాయింట్‌మెంటు తీసుకుని మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలందించి ఆయన ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేద్దామని అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. అనంతరం 28న ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ షంషేర్‌ ఆలీబేగ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, పార్టీ పట్టణ ప్రెసిడెంట్‌ సలీమ్‌, ఎంపీపీ లక్ష్మిదేవీ కృష్ణారెడ్డి, సిరాజ్‌, పత్తి రవిచంద్ర, ఉత్తమ్‌కుమార్‌, రోజ్‌లిడియా, కొత్త కృష్ణ, బొగ్గరపు శేషయ్య, ఇబ్రహీం, సలీమ్‌, ఎం.శ్రీనివాసులు, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, చాటకొండ చంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చెంచిరెడ్డి, రైతు విభాగం పట్టణ అధ్యక్షుడు నూనె శివారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, నల్లబోతుల కొండయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రంగారెడ్డి, గౌస్‌ మొహిద్దీన్‌, బచ్చు సుబ్రహ్మణ్యం, పీవీ నాయుడు, వరమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

28న వైఎస్సార్‌ సీపీ ర్యాలీని విజయవంతం చేయాలి

వైఎస్సార్‌ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement