28న ర్యాలీని జయప్రదం చేయండి
● వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపు
మద్దిపాడు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా ఉద్యమ ర్యాలీని పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఆ మేరకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టపాటి శేఖర్‌రెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచురెడ్డి, నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, దుంపా యలమందారెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


