
బోధనకు దూరం చేసేందుకే పరీక్ష విధానంలో మార్పులు
ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేందుకే పరీక్ష విధానంలో మార్పులు చేపట్టి, బుక్‌లెట్ అసెస్‌మెంట్ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చినట్లుంది. ప్రతీరోజూ ఏదో ఒక సమాచారం విద్యాశాఖ అత్యవసరమంటూ యాప్‌లలో అప్లోడ్ చేయమనడం, విద్యా కిట్లు పంపిణీ అప్లోడ్ చేయాలంటూ ఒత్తిడి, యాప్‌ల భారం తగ్గిస్తామని చెబుతూనే ఒకే యాప్‌లో అనేక సమాచారాలు పెట్టమంటున్నారు. కింది స్థాయి అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. విద్యార్థులకు అందజేసిన అసెస్మెంట్ పుస్తకాల్లో విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులకే ఎక్కువ రాతపని ఉండేలా తయారు చేశారు. వందల మంది విద్యార్థులు ఉన్నచోట ఒక ఉపాధ్యాయుడు ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో అర్థం కాని గందరగోళ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు పూర్తిగా బోధనకు దూరమవుతున్నారు. పరీక్షలు విద్యార్థులు రాస్తున్నారా? ఉపాధ్యాయులు రాస్తున్నారా? అన్న ప్రశ్న నేడు పాఠశాలల్లో నెలకొని ఉంది. అసంబద్ధ నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చడం సరికాదు. పరీక్ష విధానం పాత పద్ధతిలోనే కొనసాగించాలి.
– షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు