రోడ్డున పడిన సచివాలయ ధ్రువీకరణ పత్రాలు!
కొమరోలు: గ్రామ సచివాలయంలో ఉండాల్సిన సచివాలయ ఖాళీ ధ్రువీకరణ పత్రాలు రోడ్డునపడ్డాయి. కొమరోలు మండలంలోని పురుషోత్తమునిపల్లె గ్రామ రహదారికి ఇరువైపులా కిలోమీటరు మేర ధ్రువీకరణ పత్రాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఓ పొలంలో వందలకొద్ది ఖాళీ బాండ్ పేపర్లు పడి ఉండటాన్ని అటువైపుగా వెళ్తున్న ప్రజలు చూసి విస్తుపోయారు. ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ, జనన, మరణ తదితర ధ్రువీకరణ పత్రాలను గ్రామ సచివాలయంలో ఈ బాండ్ పేపర్ మీదనే ప్రింట్ తీసి ఇస్తారు. ఈ మార్గానికి సమీపంలో సచివాలయం లేకపోవడంతో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ గ్రామ సచివాలయానికి చెందినవని స్థానికులు చర్చించుకుంటున్నారు.
రోడ్డున పడిన సచివాలయ ధ్రువీకరణ పత్రాలు!


