దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Published Wed, Jun 12 2024 1:06 AM | Last Updated on Wed, Jun 12 2024 1:18 AM

దూసుక

త్రిపురాంతకం: మరో గంట వ్యవధిలో క్షేమంగా ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ను మృత్యువు కాటేసింది. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండల పరిధిలోని బీఆర్‌ జంక్షన్‌ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం నర్శింగపల్లి గ్రామానికి చెందిన ఎం.ఓబులేసు(35) డిప్యుటేషన్‌పై ఒడిశా రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడేళ్ల క్రితం శ్రావణి అనే యువతితో వివాహం కాగా ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తన ఇద్దరు పిల్లల చదువుల రీత్యా మంగళగిరిలో నివాసం ఉంటున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో భార్యాపిల్లలు స్వగ్రామమైన నర్శింగపల్లికి వెళ్లారు. ఒడిశా నుంచి సెలవుపై వచ్చిన ఓబులేసు.. పాఠశాలలు పునఃప్రారంభించే సమయం కావడంతో భార్యాపిల్లలను తీసుకురావడానికి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో బీఆర్‌ జంక్షన్‌ వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓబులేసు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై సాంబశివయ్య పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు.

కారును లారీ ఢీకొట్టడంతో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

త్రిపురాంతకం మండలం బీఆర్‌ జంక్షన్‌ సమీపంలో ఘటన

మృతుడిది వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల మండలం నర్శింగపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
దూసుకొచ్చిన మృత్యువు
1/2

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు
2/2

దూసుకొచ్చిన మృత్యువు

Advertisement
 
Advertisement
 
Advertisement