
ప్రొవిజన్స్ షాపును ప్రారంభిస్తున్న పీడీ రవికుమార్
ఒంగోలు టౌన్: మహిళా సమృద్ధి యూనిట్ల ద్వారా స్వయం సహాయక గ్రూపు సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మెప్మా పీడీ టి.రవికుమార్ సూచించారు. శుక్రవారం ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని త్రోవగుంట, కమ్మపాలెం, ఇందుర్తి నగర్, మరాఠిపాలెం, కబాడీపాలెంలో చికెన్ అండ్ ఎగ్ సెంటర్, కూరగాయలు, కూల్ డ్రింక్స్, శారీస్ సెంటర్, టైలరింగ్ షాపు, ప్రొవిజన్స్, టిఫిన్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ రవికుమార్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ ద్వారా జిల్లాలో 133 సమాఖ్యలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సమాఖ్య పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు తక్కువ వడ్డీతో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రుణం మంజూరైనట్లు వివరించారు. దీని ద్వారా యూనిట్లు ఏర్పాటు చేసుకున్న సభ్యులు వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసినవారు విజయవంతం అవుతారని చెప్పారు. కార్యక్రమంలో జీవనోపాధుల టెక్నికల్ ఎక్స్‌పర్ట్ ఎన్.జయకుమార్, సీఓ రమణమ్మ, రూపాలక్ష్మి, మరియమ్మ, డీఆర్‌పీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.