ఒంగోలు గిత్తల బొమ్మలతో ఐ లవ్ ఒంగోలు స్వాగత బోర్డు
నగరంలో డ్రెయిన్లు
మేయర్‌తో పాటు 50 మంది కార్పొరేటర్లు, స్టాండింగ్ కమిటీ
125 మెట్రిక్ టన్నులు
630 కి.మీ
నగరంలో రోడ్ల పొడవు
ప్రతి రోజూ చెత్త సేకరణ
420 కి.మీ
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని నగర పాలక సంస్థ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో జగనన్న హరిత నగరాలు, నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాం కార్యక్రమాల్లో భాగంగా నగర సుందరీకరణ పనుల్లో వేగం పుంజుకున్నాయి. జగనన్న హరిత నగరాల్లో భాగంగా నగరంలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధమైన పనులు చేపట్టాలని అధికారులు ముందుగా సర్వే చేసుకున్న ప్రకారం ఆ విధంగా అభివృద్ధి పను లు చేపడుతున్నారు. అదేవిధంగా నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాంలో భాగంగా కూడా నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తున్నారు.
నగరంలో 8 హాట్‌స్పాట్స్ గుర్తింపు:
ఒంగోలు నగరంలో వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ఎనిమిది ప్రాంతాలను అధికారులు గుర్తించారు. అంటే అక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవటం, పచ్చదనం లేకపోవటంతో మురుగు ఏర్పడి దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా రోడ్లు విస్తరింపచేయటం, విస్తారంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. నగరంలో ప్రధానంగా అధికారులు గుర్తించిన ప్రాంతాలు దక్షిణ బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాలు, ముంగమూరు రోడ్డు పరిసర ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్–కొత్త కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలు, ట్రంకురోడ్డు వై జంక్షన్ నుంచి దక్షిణ బైపాస్ రోడ్డు, మంగమ్మ కాలేజీ జంక్షన్ నుంచి ఉత్తరం బైపాస్ వరకు, గుత్తికొండవారిపాలెం డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాలు, కర్నూలు రోడ్డు, పాత జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంతాలను గుర్తించారు.


