మాట్లాడుతున్న పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాదరెడ్డి
మార్కాపురం టౌన్: పీడీసీసీ బ్యాంకు ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మార్కాపురం, వైపాలెం, బేస్తవారిపేట, గిద్దలూరు, పొదిలి, కురిచేడు, దర్శిబ్రాంచ్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 29 బ్రాంచీల ద్వారా రూ.3,200 కోట్ల రుణాలిచ్చి 97 శాతం రికవరీలో ఉన్నామన్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం త్వరలో బ్యాంకులను డిజిటలైజేషన్ చేసి ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. బ్యాంకు ద్వారా కారు, ఎడ్యుకేషన్, హౌసింగ్ తదితర రుణాలను ఖాతాదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.100 కోట్లు దాటిన బ్రాంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని మంజూరు చేస్తుందని, ఆ ప్రాంతంలో బ్యాంకు సొంత భవనాలను నిర్మిస్తామన్నారు. జిల్లాలో 26 మందికి అసిస్టెంటు మేనేజర్లుగా పదోన్నతులు కల్పించామని, కారుణ్య నియామకం కింద ముగ్గురికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, స్వయం సహాయక గ్రూపులకు బంగారు రుణాలు, జగనన్న తోడు, పీఎం సహాయ నిధి, స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పర్సనల్ లోన్లు అందిస్తామన్నారు. మొబైల్ ఏటీఎం ఏర్పాటుతో ప్రజలకు మరింత సేవలు అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు అభివృద్ధి కోసం డిపాజిట్ల సేకరణ, రుణాల రికవరీపై సిబ్బంది దృష్టి పెట్టాలని తెలిపారు. సమావేశంలో పాలవర్గ సభ్యులు బాలగురవయ్య, జనరల్ మేనేజర్ కె.రాఘవయ్య, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
పీడీసీసీ బ్యాంకు చైర్మన్
వైఎం ప్రసాద్‌రెడ్డి


