
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో శిద్దా సుధీర్ దంపతులు
ఒంగోలు టౌన్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో టీటీడీ సభ్యులు శిద్ధా సుధీర్ దంపతులు వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవార శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం రంగనాయక మండపంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం శిద్ధా దంపతులుస్వామివారిని దర్శించుకున్నారు.వేద ఆశీర్వాదాలతో తీర్థప్రసాదాలనుఅందజేశారు.