
చీరాల టౌన్: అన్నదాతలతో పాటు పాడిరైతులు ఆర్థికంగా వృద్ధి చెందేలా సంక్షేమ పథకాలు అందించి పశువుల సంపూర్ణ ఆరోగ్యానికి భద్రత కల్పిస్తున్న ఏకై క సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. మంగళవారం మండలంలోని ఈపురుపాలెం పశువైద్యశాలలో జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పశువైద్యురాలు పావని ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటుగా జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, చీరాల ఏడీ డాక్టర్ చిట్టిబాబు హాజరయ్యారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశువుల సంరక్షణ కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, పశువులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు 1962 సంచార వైద్యశాల, రాయితీపై పథకాలు అందిస్తుందన్నారు. పాడి పశువులకు సీజనల్ వ్యాధులకు గురికాకుండా టీకాలు, పోషకాహారాన్ని అందిస్తుందన్నారు. అనంతరం గాలికుంటు టీకాలను పాడిపశువులకు పశువైద్యులు వేశారు. ఏప్రిల్ 24 తేదీ వరకు జరిగే టీకాల పంపిణీలో పశుపోషకులు విధిగా తమ పశువులు, గేదెలకు గాలికుంటు రాకుండా టీకాలు వేయించాలన్నారు. కార్యక్రమంలో ఏహెచ్‌పీలు, గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు.