
మార్గదర్శిని కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి కేంద్రం బృందం జిల్లాకు వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న కేంద్ర ప్రభుత్వ వ్యయ విభాగం డైరెక్టర్ ఆర్‌కే.తాలూక్ దార్, ఆహార, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ సెక్రటరీ సీతారామ్ మీనాతో కూడిన బృందం జిల్లాలో పర్యటించింది. ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పర్యటించారు. కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులతో, కెరియర్ గైడెన్స్ మెంటార్లతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు.