
కోటమ్మ పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి
సింగరాయకొండ: వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబుకు మాతృవియోగం కలిగింది. అశోక్‌బాబు తల్లి కోటమ్మ కాకినాడలోని తన మనమరాలు వద్ద ఉంటుంది. కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమె..శనివారం తెల్లవారుజామున గుండెనొప్పి రావటంతో మృతి చెందింది. కోటమ్మకు ముగ్గురు కుమారులు. ఒకరు వరికూటి కాగా, మరొకరు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, కంటి వైద్య నిపుణులు వరికూటి అమృతపాణి, ఒంగోలులో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ వరికూటి వెంకట రమణారావు. తల్లి కోటమ్మ పార్ధివదేహాన్ని కాకినాడ నుంచి సాయంత్రం ఒంగోలుకు తీసుకుని శ్రీనగర్ కాలనీలో రమణారావు నివాసం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. సోమవారం ఉదయం 10 గంటల తరువాత సంతనూతలపాడులోని తన నివాసం నుంచి అంత్యక్రియలు ప్రారంభమవుతాయని వరికూటి వివరించారు. కోటమ్మ పార్థివదేహానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులు నివాళులర్పించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, రాష్ట్ర సభ్యులు గుళ్లాపల్లి వీరభధ్రాచారి, రాష్ట్ర కార్యదర్శి పేరం సత్యం, జిల్లా అధ్యక్షుడు తాటిపర్తి వెంకటస్వామి, బాపట్ల జిల్లా అద్యక్షుడు భగత్‌సింగ్‌లు నివాళులర్పించారు. వీరితో పాటు మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, పొన్నలూరు జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, జిల్లా సోషల్‌మీడియా కన్వీనర్ రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సూదనగుంట హరిబాబు, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, ఆనం సత్యన్నారాయణరెడ్డి, తహశీల్దార్ సీహెచ్ ఉష, కొండపి సీఐ మాతంగి శ్రీనివాసరావు, పొన్నలూరు, మర్రిపూడి ఎస్సైలు రాజారావు, అంకమ్మరావులు నివాళులర్పించారు.