
చీమకుర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో విశేష స్పందన ఉందని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని బక్కిరెడ్డిపాలెంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయనన్నీ పథకాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నాలుగేళ్లుగా అమలు చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ ఇంటికెళ్లినా ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే అందుకు నిదర్శనమని ఈ సందర్భంగా తెలిపారు. తొలుత బక్కిరెడ్డిపాలెం గ్రామంలోకి ప్రవేశించినప్పుడు స్థానిక గ్రామస్థులు గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, పులి వెంకటరెడ్డి, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో భారీగా స్వాగతం పలికారు. గ్రామంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందించి పథకాలను వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల రూరల్ కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమల్లో అగ్రస్థానం గడప గడపలో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి