మార్కాపురం: పట్టణంలోని నెహ్రుబజార్‌లోని ఒక వైద్యశాలలో చికిత్స పొందుతున్న తల్లికి సాయంగా వెళ్లిన బాలిక పట్ల ఆ హాస్పిటల్‌లో పనిచేసే కాంపౌండర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. కంభం రోడ్డులో నివాసం ఉండే మహిళకు అనారోగ్యానికి గురి కావడంతో నెహ్రు బజార్‌లోని స్టూడియోల వీధులో ఉండే ఒక ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం వెళ్లింది. తల్లి వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో కాంపౌండర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.