
వెలిగొండ ప్రాజెక్టు పనుల ప్రారంభానికి నాడు తండ్రులు తాపత్రయం పడగా పనుల పూర్తిపై వారి తనయులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటి ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని పలు దఫాలుగా కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై ఊపందుకున్నాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ దీనిని పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి సైతం సీఎం జగన్‌ను కలసి పనులు పూర్తయ్యేలా కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.