
ఒంగోలు అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. ప్రకాశం భవనంలో రోడ్డు భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ–డార్ అప్లికేషన్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఐ–రాడ్ అప్లికేషన్ మరింత అప్‌డేట్ చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు ముమ్మరం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్‌పీ నాగేశ్వరరావు, డీటీసీ చందర్, డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ మూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్‌ఎంఓ చైతన్యవర్మ, పశుసంవర్ధక శాఖ అధికారి బేబిరాణి, రోడ్లు భవనాలు, రవాణాశాఖ, ట్రాఫిక్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్