
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్
సీఎం వైఎస్ జగన్‌తో
కనిగిరి రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కనిగిరి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు బుర్రా మధుసూదన్‌యాదవ్ శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ వద్ద కలిశారు. ఎమ్మెల్సీ ఓటింగ్ విషయంలో తనపై దుష్ప్రచారం చేయడం వెనుక దాగిన కుట్రను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని ఆప్యాయతతో హత్తుకున్నట్లు బుర్రా వెల్లడించారు.
కుట్రలు చేసేవారు దహించుకుపోతారు
‘నేను ఇద్దరినే నమ్ముకున్నా.. ఒకరు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి, మరొకరు నా రాజకీయ దేవుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి’ అని ఎమ్మెల్యే బుర్రా పేర్కొన్నారు. సీఎంతో భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. కనిగిరి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు తనకు మెండుగా ఉన్నాయని.. వారి ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తనపై దుష్ప్రచారం చేయిస్తూ కుట్రలు పన్నుతున్నవారు.. నిలువునా దహించుకుపోతారని చెప్పారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని, తాను కష్టపడి పైకి వచ్చిన వాడినన్నారు. వైఎస్ జగన్‌తిరిగి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తనపై చే సిన దుష్ప్రచారాన్ని సీఎం దృష్టికి
తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే బుర్రా వెల్లడి