
పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్
కలెక్టర్ దినేష్‌కుమార్, బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ దంపతులకు ఉగాది పచ్చడి పంచుతున్న వేదపండితులు
వేడుకలో కవులను సన్మానిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ దంపతులు, జూపూడి ప్రభాకర్, జేసీ అభిషిక్త్ కిషోర్
భువన విజయం పౌరాణిక నాటికను ప్రదర్శిస్తున్న విద్యార్థినులు
● రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
యర్రగొండపాలెం: శోభకృతునామ తెలుగు సంవత్సరంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, అందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక శివాలయంలో బుధవారం నిర్వహించిన పంచాంగ శ్రాంణంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చూసుకుంటూ చక్కటి పాలన అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి దేవతలు కూడా సహకరిస్తున్నారని, శోభకృతు నామ సంవత్సరంలో అంతా మంచి జరుగుతుందని పంచాంగం చెబుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడేలా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. ముందుగా మంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకుడు రెంటచింతల రామయ్య, ప్రముఖ కవి దేవులపల్లి విశ్వనాథం ఆయనను ఆశీర్వదించారు. గౌత ఆంజనేయశర్మ పంచాంగాన్ని చదివి వినిపించారు. తాళ్లపల్లి సత్యనారాయణ మంత్రికి సంప్రదాయ కండువలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ విజయభాస్కర్, పీడీసీసీ బ్యాంకు డైరెక్టర్ బాలగురవయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఐ.వి.సుబ్బారావు, సూరె రమేష్, మొగలి సుబ్బారావు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు పార్టీ మండల అధ్యక్షులు ఓబుల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్ జబీవుల్లా, సర్పంచ్ అరుణాబాయి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.బాలచెన్నయ్య పాల్గొన్నారు.
ఉగాది వేడుకల్లో ఎస్పీ దంపతులు
ఒంగోలు టౌన్: శోభకృత్ నామ సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గర్గ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ దంపతులు జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో వేంచేసి ఉన్న సీతారామ చంద్ర స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో బుధవారం సీతారాముల స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్పీ తండ్రి, రిటైర్డ్ డీజీపీ సత్యేంద్ర గర్గ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన పంచాంగావిష్కరణ చేసి భక్తులకు పంపిణీ చేశారు. జిల్లా ప్రజలు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో తెలుగు ప్రజలకు అన్ని విధాలా మేలు కలుగజేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు యం.రమణ దీక్షితులు, యం.దక్షిణామూర్తి, సీతారామచంద్ర స్వామి భక్తజన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

ఉగాది పంచాంగ శ్రవణంలో ఎస్పీలు మలికాగర్గ్, వకుల్ జిందాల్ దంపతులు