
మిర్చిని బ్యాగ్‌లకు నింపుతున్న కూలీలు
కొత్తపట్నం: దిగజారిన పచ్చిమిర్చి ధర రెట్టింపైంది. తీర ప్రాంత గ్రామాలైన కొత్తపట్నం, రాజుపాలెం, మోటుమాల, పాదర్తి, మడనూరు, ఈతముక్కల, రంగాయపాలెం గ్రామాల్లో ఎక్కువగా పచ్చి మిర్చి సాగు చేస్తున్నారు. జనవరిలో కోతలు మొదలైనప్పటి నుంచి ధర అనుకూలంగా లేదు. 50 కేజీ బ్యాగ్ రూ.300 నుంచి రూ.400 ఉండేది. కనీసం బ్యాగ్ మిర్చి కోయాలంటే కూలీ రూ.250 ఇచ్చే వాళ్లు. ఇప్పుడు 50 కేజీ బ్యాగ్ రూ.1,100 నుంచి రూ.1,200 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇదే ధర రెండు నెలల పాటు ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. ధర పెరగడం వలన మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. పెట్టిన పెట్టుబడులు పోను లాభాలు కళ్లజూస్తున్నామని రైతులు సంతోషంగా చెబుతున్నారు.