
శంకర్‌సదా
నాగులుప్పలపాడు: మండలంలోని కనపర్తి గ్రామ శివారు చిన్నంగారి పట్టపుపాలెం సముద్ర తీరప్రాంతానికి గుర్తు తెలియని పురుషుని మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుని వయసు 40 ఏళ్లు ఉంటాయని, బ్లూ కలర్ చొక్కా ధరించి ఉన్నాడని ఎస్సై హరిబాబుతెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.
దేవాలయాల వద్ద
ప్రత్యేక భద్రతా చర్యలు
● ఎస్పీ మలికాగర్గ్
ఒంగోలు టౌన్: ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలు, తిరునాళ్ల జరిగే ప్రదేశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తోపులాటలు, తొక్కిసలాటలు లాంటివి జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రసిద్ధ దేవస్థానాల వద్ద వచ్చే భక్తులకు కోసం పార్కింగ్ ఏర్పాటు చేశామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచామన్నారు. ఏఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఎస్పీ(క్రైమ్) శ్రీధర్‌రావు, ఏఆర్ ఎస్పీ అశోక్‌బాబు, ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, ఏఆర్ డిఎస్పీ వెంకటేశ్వరరావు, ఐసీసీఆర్ ఇన్‌స్పెక్టర్ కె.రాఘవేంద్రరావు, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, హరిబాబు, శ్రీకాంత్ నాయక్ పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
ఉలవపాడు: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చాకిచర్ల పంచాయతీ శ్రీరామపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. బీహర్‌లోని సమస్తిపూర్‌కు చెందిన శంకర్ సదా(20) అనే యువకుడు శ్రీనివాస బయోప్లాంట్ నర్సరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఇనుప రాడ్‌తో టార్పాలిన్ పట్టను పైకి ఎత్తుతున్న సమయంలో విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం