కరెంట్‌ ఉందో లేదో అలా తెలుసుకో.. బండి సంజయ్‌కు పువ్వాడ కౌంటర్‌

Puvvada Ajay Kumar Strong Counter To BJP Bandi Sanjay - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్‌ఎస్‌ తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ సహా ఖమ్మం బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సభలో సీఎం కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసి సంచలన కామెంట్స్‌ చేశారు. ఇక, కేసీఆర్‌ కామెంట్స్‌ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తనను తానే ఓడించుకుంటోంది. కంటి వెలుగులో బండి సంజయ్‌ అద్దాలు తీసుకోవాలి. బండి అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థలను కేంద్రం మూసివేస్తోంది.  తెలంగాణలో 24 గంటల కరెంట్‌ ఉందో లేదో తెలియాలంటే ఏ మోటర్‌లోనైనా బండి సంజయ్‌ వేలు పెట్టి చూడాలని చురకలంటించారు. మాకు వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం. ఇంత పెద్ద సమావేశానికి ప్రత్యేకమైన ఆహ్వానం అవసరం లేదు.. బొట్టుపెట్టి పిలవరు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో చారిత్రాత్మక సభ జరిగింది. కరీంనగర్‌ సింహగర్జన సభం తెలంగాణ ఏర్పాటుకు స్పూర్తి. ఖమ్మం సభ దేశ అభివృద్దికి నాంది కా​బోతోంది. ఖమ్మం సభ విజయంతో బీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి అడుగు ప్రారంభమైంది. సభపై ఎంత మంది విమర్శలు చేసినా, వక్రభాష మాట్లాడిని ప్రజలు సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నారని రుజువైంది అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ సభకు వారెందుకు రాలేదు.. బండి సంజయ్‌ సూటి ప్రశ్న

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top