PM Modi Gave AAP Certificate of India Most Honest Party Says Kejriwal - Sakshi
Sakshi News home page

Goa Assembly Election 2022: అవినీతి రహిత పాలన మా డీఎన్‌ఏలోనే ఉంది: కేజ్రీవాల్‌

Jan 16 2022 1:43 PM | Updated on Jan 20 2022 1:54 PM

PM Modi Gave AAP Certificate Of India Most Honest party Says Kejriwal - Sakshi

దేశంలో అత్యంత నిజాయితీపరమైన పార్టీ ఏదంటే.. ఆప్‌ అని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారట!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా.. గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పట్టుసాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  ప్రయత్ని‍స్తున్న తెలిసిందే. ఈ తరుణంలో ప్రచారంలోకి దిగిన ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఆదివారం గోవాలో పర్యటించారు.  గోవా ప్రజలు, అభివృద్ధి కోసం 13 పాయింట్ల ఎజెండాతో కూడిన 'విజన్ ప్లాన్‌'ను అమలు చేయనున్నట్టు  ప్రకటించడంతో పాటు పనిలో పనిగా  బీజేపీపైనా సెటైర్లు పేల్చారు. 


ఆదివారం గోవాలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..  దేశానికి  స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన పార్టీల్లో ఆప్‌ అత్యంత నిజాయితీ ఉన్న పార్టీ అని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. అంతేకాదు సర్టిఫికెట్‌ ఆఫ్‌ హానెస్టీ(నిజాయితీ) కూడా ఇచ్చారు అంటూ వెటకారం ప్రదర్శించారు. మోదీగారు నా మీద, మనీశ్‌ సిసోడియా మీద సీబీఐ దాడులు చేయించారు. మా ఎమ్మెల్యేలను 21 మందిని అరెస్ట్‌ చేయించారు. 400 ఫైల్స్‌ను పరిశీలించాలని ఒక కమిషన్‌ కూడా వేశారు. ఏం ఒరిగింది? ఏం జరగలేదు.. అవినీతిరహిత పాలన అనేది మా డీఎన్‌ఏలోనే ఉంది అంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉద్ఘాటించారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఎజెండాను తు.చ.తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 14న జరిగే ఎన్నికల కోసం గోవా ప్రజలు ఎదురు చూస్తున్నారని, గతంలో బీజేపీ, కాంగ్రెస్ తప్ప మరో మార్గం లేని గోవా ప్రజలకు ఇప్పుడు 'ఆప్' ఆశాకిరణమని అన్నారు. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. 

హామీలు ఏంటంటే..
గోవా 'విజన్ ప్లాన్‌'లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 13 పాయింట్ల ఎజెండాతో ముందుకు వెళ్తుందని కేజ్రీవాల్ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన మహిళలందరికీ ప్రతినెలా రూ.1,000 సాయం అందిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యటకరంగాన్ని అభివృద్ధి చేస్తామని, నిరంతరాయ విద్యుత్, నీటిని ఉచితంగా అందిస్తామని, రోడ్లను మెరుగుపరుస్తామని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో, జిల్లాల్లో మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన కోసం మెహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు తెరుస్తామని, రైతులతో చర్చించి వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, వ్యాపార వ్యవస్థను క్రమబద్ధీకరించి, సులభతరం చేస్తామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, ఉపాథికి నోచుకోని వారికి నెలకు రూ.3,000 సాయం చేస్తామని చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తామని, మైనింగ్‌ పనులు ప్రారంభిస్తామని, భూమి హక్కులు పునరుద్ధరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement