గోవా ఆప్‌ సీఎం అభ్యర్ధిని ప్రకటించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

Goa Election: AAP Names Amit Palekar As Its CM Candidate - Sakshi

పనాజి: 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు దేశంలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. ఈ క్రమంలో గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పట్టుసాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్ని‍స్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గోవా ఆప్‌ సీఎం అభ్యర్థిగా లాయర్ అమిత్ పాలేకర్‌ పేరును ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం పనాజిలో జరగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.
చదవండి: అఖిలేష్‌కు దిమ్మతిరిగే షాక్‌.. బీజేపీలోకి యులాయం చిన్న కోడలు

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఆప్‌ పోటీ చేస్తుందని వెల్లడించారు. గోవా ప్రజలు ఆప్‌కు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే గత ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ 39 స్థానాల్లో పోటీ చేసిన ఆప్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే ఈ సారి ఆప్‌ గోవాలో అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్‌లో రాష్ట్రాన్ని అభిృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో ఎల్విస్‌ గొమెస్‌ నేతృత్వంలో ఆప్‌ బరిలోకి దిగింది. అయితే ఆయన వివిధ కారణాలతో 2020లో పార్టీని వీడాను. ఈ నేపథ్యంలో ఆప్‌ ఆద్మీ పార్టీ కొత్త సీఎం అభ్యర్థిని రంగంలోకి దింపింది.
చదవండి: రసవత్తరంగా యూపీ ఎన్నికల సమరం.. అసెంబ్లీ బరిలో అఖిలేష్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top