ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ | MLA Rajagopal Reddy Slams Govt for Withholding Funds to MLAs | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌

Mar 29 2026 7:19 PM | Updated on Mar 29 2026 7:26 PM

MLA Rajagopal Reddy Slams Govt for Withholding Funds to MLAs

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ సంచలన ‍వ్యాఖ్యలు చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

నిధుల కోసం మంత్రుల.. సీఎం చుట్టూ తిరగాలా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం అంటే మంత్రులే కాదు.. ఎమ్మెల్యేలందరం కలిస్తునే ప్రభుత్వమనే విషయం తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా, మంత్రులకు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని ప్రభుత్వానికి సూచించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement