‘మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు’ | Harish Rao Accuses Minister Ponguleti Of Corruption, Urges Sitting Judge Led Inquiry | Sakshi
Sakshi News home page

‘మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు’

Mar 29 2026 5:49 PM | Updated on Mar 29 2026 6:29 PM

BRS Leader Harish Rao Takes On Congress Govt

హైదరాబాద్‌:  మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతిక పాల్పడిందనే విషయం ప్రజలకు అర్థమైందని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు పేర్కొన్నారు. కాకపోతే డైవర్షన్‌ కోసం రేవంత్‌ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.  మంత్రిని కాపాడటానికే సీబీసీఐడీ విచారణ వేశారని, హౌస్‌ కమిటీ గానీ, సిట్టింగ్‌ జడ్జితో గానీ విచారణ చేయించాలని హరీష్‌ డిమాండ్‌ చేశారు. 

ఈరోజు(ఆదివారం, మార్చి 29వ తేదీ) ప్రెస్‌మీట్‌లో హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘ పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైంది. తప్పు జరిగిందని రేవంత్‌ స్వయంగా ఒప్పుకున్నారు. మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది’ అని విమర్శించారు.

సీఎం రేవంత్‌కు హరీష్‌ సవాల్‌
సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్‌ విసిరారు. ‘మీ తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్ధమైతే.. హౌస్‌ కమిటీ విచారణకు నేను సిద్ధం. హౌస్‌ కమిటీ విచారణ.. సీఐడీ విచారణ కాకుండా, ఇద్దరం కలిసి సిట్టింగ్‌ జడ్జితో విచారణకు వెళ్దాం.. సీఎం రేవంత్‌ సిద్ధంటే.. నేను సిద్ధం’ అని చాలెంజ్‌ చేశారు. 

నిన్న(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీలో హరీష్‌ మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్‌ జరుగుతుందని ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్‌ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవని,. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలని, నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారని మండిపడ్డారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement