‘ కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ ఒక్కటే’ | Bandi Sanjay Alleges Secret Pact Between KTR And CM Revanth, Claims Congress BRS Acting As One | Sakshi
Sakshi News home page

‘ కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ ఒక్కటే’

Mar 29 2026 5:21 PM | Updated on Mar 29 2026 6:42 PM

BJP MP Bandi Sanjay Slams Congress Govt

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌. ముఖ్యమంత్రి రేవంత్‌కు కేటీఆర్‌ అంటే ప్రేమని, అందుకే ఈ కార్ రేస్, విద్యుత్ కొనుగోలు, ఫామ్ హౌస్, ఫోన్ ట్యాపింగ్ కేసులపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన బండి సంజయ్‌..  ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాళేశ్వరంపై విచారణ ఒక్కటే కనబడుతోందని విమర్శించారు. 

హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ మీద ఎందుకు తగ్గిందన్నారు బండి సంజయ్‌. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రయత్నాలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయని, కేటీఆర్‌ను కవితను కలిపే ప్రయత్నం  రేవంత్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు, రేవంత్‌కు మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని బండి సంజయ్‌ ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement