తాంత్రిక పూజలు జరిగింది నీ హయాంలో కాదా? | Minister Vellampalli Srinivas Slams Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు

Sep 16 2020 8:09 PM | Updated on Sep 16 2020 8:34 PM

Minister Vellampalli Srinivas Slams Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. బాబు హాయాంలో జరిగిన వాటిని తమకు అంటగట్టాలని చూస్తున్నారని, అమరావతి భూ స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చేశారు. అంతర్వేది ఘటన తర్వాత అన్ని దేవాలయాల రథాలను పరిశీలించాం. అందులో భాగంగానే దుర్గగుడి రథాన్ని కూడా పరిశీలించాం. మూడు సింహాలు కనిపించడం లేదని తేలింది. ( రాష్ట్రాన్ని పీడిస్తున్న బాబు )

విచారణ పూర్తి కాకముందే చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అమ్మవారి పట్టుచీరల దొంగతనం ఎవరి హయాంలో జరిగింది బాబూ? తాంత్రిక పూజలు జరిగింది నీ హయాంలో కాదా?. 3 సింహాల మాయం వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. టీటీడీ భూములు అమ్మడానికి తీర్మానం చేసింది చంద్రబాబు కాదా?. సదావర్తి భూములను వేలం వేసింది ఎవరు బాబూ?. రథాల కుట్రలో చంద్రబాబు పాత్ర ఉంద’’ని అనుమానం వ్యక్తం చేశారు. ( ఎన్ని గుళ్లు తిరిగినా ఆయన పాపాలు పోవు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement