‘కరోనాకు గేట్లు తెరిచిన మోదీ: లెక్కలన్నీ అబద్ధం’

Hide The Actual Corona Deaths Says Congress Leader Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ చీఫ్‌, ఎంపీ రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ వ్యాప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమని మరోసారి విమర్శించారు. ఈ సెకండ్‌ వేవ్‌కు మోదీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్- 19ను మోదీ సరిగా అర్థం చేసుకోలేకపోయారని మండిపడ్డారు. రెండు శాతం ప్రజలకు వాక్సిన్  ఇచ్చి వైరస్‌కు గేట్లు బార్లా తెరిచారు అని ధ్వజమెత్తారు.

ఇక ప్రధాని మోదీ పెద్ద ఈవెంట్ మేనేజర్ అని రాహుల్‌ అభివర్ణించారు. కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్‌ వేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో రాహుల్‌ ఈ విధంగా మాట్లాడారు. ‘మనకు కావాల్సింది ఈవెంట్ మేనేజ్‌మెంట్  కాదు.. వైరస్ కట్టడికి  వ్యూహాలు కావాలి. వ్యాక్సిన్‌పై సరైన వ్యూహం లేకపోతే మళ్లీ అనేక వేవ్‌లు వచ్చే అవకాశం ఉంది. కరోనా మరణాల గణాంకాలు అబద్ధం. ప్రభుత్వం వీటిపై ప్రజలకు నిజం చెప్పాలి. కరోనా పై మేం పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరించాం. వ్యాక్సిన్‌ ఒక్కటే శాశ్వత పరిష్కారం’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు.

చదవండి: అర్ధరాత్రి మహిళా ఎంపీ కారుపై రాళ్లు, రాడ్లతో దాడి
చదవండి: సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top