మేమొస్తే పాతబస్తీ.. భాగ్యనగరమే

GHMC Elections 2020: BJP President Bandi Sanjay Interview With Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

భాగ్యనగరాన్ని పాతబస్తీగా మార్చే పార్టీలకు గుణపాఠం చెప్పాలి

మత విద్వేషాలను రెచ్చగొట్టింది సీఎం కేసీఆరే

సాక్షి, హైదరాబాద్ ‌: ‘మాకు ఉత్తి మాటలు చెప్పడం రాదు... హైదరాబాద్‌ను ఇస్తాంబుల్, డల్లాస్‌లా చేస్తామని మేం చెప్పం. మాకు గ్రేటర్‌ ప్రజలు మేయర్‌ పదవిని అప్పగిస్తే ఇండోర్, సూరత్, అహ్మదాబాద్‌లాగా అభివృద్ధి చేసి తీరుతాం. భాగ్యనగరాన్ని పాతబస్తీలా చేయడం కాదు... పాతబస్తీని భాగ్యనగరంగా చేస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. జీఎహెచ్‌ఎంసీ ఎన్నికల పేరుతో హైదరాబాద్‌ను ఎంఐఎంకు అప్పగించి, హైదరాబాద్‌ నుంచి హిందువులను తరిమి వేస్తారా.. అని తాను అడిగితే మతతత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

భాగ్యలక్ష్మి  దేవాలయానికి వెళితే మతతత్వం అవుతుందా? ఆ దేవాలయం పాతబస్తీలో ఉందా? పాకిస్థాన్‌లో ఉందా? అన్నది సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ దృష్టిలో పాతబస్తీ ప్రజలు పాకిస్థాన్‌ వాదులా? అని ప్రశ్నించారు. 80 శాతం ఉన్న హిందువులపట్ల టీఆర్‌ఎస్, ఎంఐఎం వివక్ష చూపుతోందని, అవమానించేలా వ్యవహరిస్తోందని అన్నారు. అందుకే మెజారిటీ ప్రజల ఆత్మాభిమాన్ని కాపాడేందుకు, భరోసా ఇవ్వడానికి బీజేపీ వెనుకడుగు వేయదన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, అభివృద్ధి చేసేందుకు బీజేపీ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో భాగ్యనగరాన్ని పాతబస్తీగా మార్చే పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు.

‘దేశంలోని 30 కోట్ల మంది ముస్లింలను వెళ్లగొడతారంటూ రెచ్చగొట్టింది ముఖ్యమంత్రి సీఎం కేసీఆరే. ముస్లింల ఓట్ల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదీ ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలే. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటమే అందుకు నిదర్శనం’అని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘సాక్షి’ఇంటర్వ్యూలో వెల్లడించిన మరిన్ని అంశాలు ఆయన మాటల్లో...

భరోసా ఇవ్వని టీఆర్‌ఎస్‌పట్ల వ్యతిరేకత..
టీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం, ప్రజాసమస్యల పరిష్కారంలో అలసత్వం, ఆపద సమయంలో భరోసా ఇవ్వలేని నిస్సహాయత... వెరసి ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీజేపీకి అధికారం రాలేదు.. సేవ చేసే అవకాశమే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ అధికారం, అవకాశాన్ని ప్రజలు బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

జీహెచ్‌ఎంసీలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. 5 ఏళ్ల కిందట అధికారంలో మేమే ఉన్నాం.. జీహెచ్‌ఎంసీలో గెలిపిస్తేనే హైదారాబాద్‌ అభివృద్ధి జరుగతదని టీఆర్‌ఎస్‌ చెప్పింది. ఆచరణ సాధ్యం కాని హామీలు, మాయమాటలు, అబద్ధాలతో గెలిచింది. ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వచ్చింది. అయితే ప్రజలు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా లేరు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌ అని సీఎం అన్నారు. కానీ, అదే మేనిఫెస్టోను వారి వెబ్‌సైట్‌ నుంచే డిలీట్‌ చేశారంటే వారి నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. కోవిడ్, వరదల సమయంలో సీఎం స్పందించకపోవడం, ఆపదలో ఉన్న వారిని పట్టించుకోకపోవడం, భరోసా నింపకపోవడం వల్ల ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఆదుకోని సీఎం, పట్టించుకోని ప్రభుత్వం మాకెందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి కాదు.. కనీసం ఆదుకోవడం లేదన్న ఆవేదనతో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ సమస్యలకు కారకులెవరు?
జీహెచ్‌ఎంసీలో ఎక్కడా రోడ్లు సరిగ్గా లేవు. డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు కబ్జా అయ్యాయి. మొన్నటి వర్షాలకు నీళ్లు రోడ్లపైకి వచ్చాయంటే.. అందుకు కారణం చెరువులను టీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేయడమే. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికార పార్టీ నేతలు మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. అందులో నీళ్లను కొబ్బరినీళ్లలా చేస్తామన్నారు. ఆ హామీలు ఏమయ్యాయి. డబుల్‌ బెడ్‌రూం పేరుతో కాలయాపన చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయడం లేదు. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. ఇలా ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు.

టీఆర్‌ఎస్‌ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి. మూసీ ప్రక్షాళన చేసిందా? డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చిందా.. రోడ్లను అభివృద్ధి చేసిందా? చెరువులు కబ్జా కాకుండా ఆపిందా.. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసిందా? భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌ వరదల పాలు కావడానికి కారణం ఎవరు? కోవిడ్‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించిందెవరు? ఇలాంటి వారికి అధికారం ఇవ్వాలా? వీటన్నింటికీ టీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలి.

కేంద్ర నిధులతోనే అంతోఇంతో అభివృద్ధి ..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నిధులను ఇస్తోంది. ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే కేంద్రం నుంచి వచ్చిన నిధుల వల్లే. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పూర్తిగా అభివృద్ధికి వెచ్చించకుండా దారి మళ్లించారు. కొన్ని కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు, ఫొటోలు మార్చి వాళ్ల పథకాలుగా చెప్పుకున్నారు. కొన్నింటిని అమలు చేయడం లేదు. ప్రజలు వాస్తవాలు ఆలోచించాలి. హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేస్తాం. 

సవాల్‌ విసిరినా ముందుకు రాలేదు..
హైదరాబాద్‌లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే సాధ్యమైంది. కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలపై, పథకాల అమలుపై ఛాలెంజ్‌ చేశాం. అయినా చర్చకు టీఆర్‌ఎస్‌ ముందుకు రాలేదు. గతంలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. 

డల్లాస్‌ కాదు.. అంతా డొల్ల
బీజేపీ గెలిస్తే ఫ్లైఓవర్లకే పరిమితం కాకుండా బస్తీలను కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేస్తాం. అందుకోసమే ప్రణాళికలు రూపొందిస్తాం. బస్తీల్లోని ప్రజలు కనీస సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తాం. కేవలం ఫ్లైఓవర్లు కాదు.. లండన్, ఇస్తాంబుల్, డల్లాస్‌ కాదు.. దేశంలోని ఇండోర్, సూరత్, అహ్మదాబాద్‌ లాగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. డల్లాస్‌కు సాధారణ ప్రజలు వెళ్లలేరు. చూడలేరు. ఇక్కడ అభివృద్ధిని ప్రజలు చూడొచ్చు. ఇండోర్‌ అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే. వాటిలెక్క భాగ్యనగరాన్ని చేస్తాం. ఆ ధైర్యం మాకు ఉంది. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్‌లాగా చేస్తామన్నారు. ఏమీ లేదు. అంతా డొల్ల. అహ్మదాబాద్‌లో 15 ఏళ్లుగా మత కలహాలు జరగలేదు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధే జరిగింది. టీఆర్‌ఎస్‌లా మేం మాయమాటలతో మోసం చేయడంలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-11-2020
Nov 29, 2020, 05:35 IST
భాగ్యగర్‌ కాలనీ/ యాకుత్‌పుర: నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడినట్లుగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మజ్లిస్, టీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని...
29-11-2020
Nov 29, 2020, 04:06 IST
సాక్షి, హైదరాబాద్‌: విచ్చిన్నకర శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్నాయని, వాటి వలలో పడొద్దని, ఆగం కావొద్దని ముఖ్యమంత్రి...
29-11-2020
Nov 29, 2020, 01:26 IST
ప్రత్యర్థి కళ్లలోని భయాన్ని బాగా దగ్గరగా చూస్తున్నప్పుడు కలిగే గెలుపు భావన ముందు, నిజమైన గెలుపు కూడా ఒక గెలుపులా...
28-11-2020
Nov 28, 2020, 21:54 IST
సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ సభలో పస లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో...
28-11-2020
Nov 28, 2020, 19:59 IST
సాక్షి, హైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీఎన్నికల ప్రచారం కోసం  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. రేపు ఉదయం 10...
28-11-2020
Nov 28, 2020, 18:18 IST
సాక్షి, హైదరాబాద్‌: 20 వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేశాం.. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా...
28-11-2020
Nov 28, 2020, 17:05 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ ఓటర్‌లకు శుభవార్త. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకునే వారు తమ ఓటరు స్లీప్‌తో...
28-11-2020
Nov 28, 2020, 16:48 IST
 గ్రేటర్ హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓట‌రు గుర్తింపుకార్డు లేకున్నా ప్రత్యామ్నాయ గుర్తింపు డాక్యుమెంట్ల‌ను చూపించి ఓటు...
28-11-2020
Nov 28, 2020, 16:03 IST
కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు హైదరాబాద్‌ చాలా చైతన్యవంతమైన నగరం.ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి.భవిష్యత్‌ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలి.అప్పుడే...
28-11-2020
Nov 28, 2020, 15:40 IST
సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ ఎవరి సొత్తు కాదని.. అక్కడ బీజేపీ పాగా వేయబోతుందని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అన్నారు....
28-11-2020
Nov 28, 2020, 14:49 IST
సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత...
28-11-2020
Nov 28, 2020, 13:46 IST
సాక్షి, హైదరాబాద్‌:  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకోవడంతో నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం...
28-11-2020
Nov 28, 2020, 13:12 IST
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని పాతబస్తీ మిత్రునికి సలాం కొడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ధ్వజమెత్తారు....
28-11-2020
Nov 28, 2020, 09:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసులు నమోదు...
28-11-2020
Nov 28, 2020, 09:11 IST
సాక్షి, సిటీబ్యూరో: బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. దుబ్బాక విజయం తర్వాత పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల...
28-11-2020
Nov 28, 2020, 09:07 IST
సాక్షి,హైదరాబాద్‌: వరుసగా నాలుగు రోజులు సెలవులొచ్చాయంటే చాలు సిటీజనులు ఆకస్మాత్తుగా జంప్‌జిలానీలవుతారు. ఏ టూరిస్ట్‌ ప్లేస్‌కో.. లేదంటే సొంత ఊళ్లకో...
28-11-2020
Nov 28, 2020, 08:50 IST
బల్దియా ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అటు టీఆర్‌ఎస్‌...ఇటు బీజేపీ గెలుపే లక్ష్యంగా ఫైనల్‌ పంచ్‌లకు సిద్ధమయ్యాయి. శనివారం సీఎం...
28-11-2020
Nov 28, 2020, 08:28 IST
సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోరు రాజధానిలో రాజకీయ వేడిని మరింత పెంచింది. విమర్శకు ప్రతి విమర్శ చేస్తూ నేతలు...
28-11-2020
Nov 28, 2020, 02:12 IST
జీహెచ్‌ఎంసీనే కాదు.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ పార్టీ నంబర్‌ వన్‌ కోసమే పోటీ పడుతుందని.. రాష్ట్రంలో తమ...
28-11-2020
Nov 28, 2020, 01:59 IST
సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంతో నగరం హోరెత్తిపోతోంది. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బల్దియా ఎన్నికల వేడి పతాకస్థాయికి...

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top