
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతం గా, ఇతర అన్ని రకాలుగా పూర్తిస్థాయిలో బలోపేతం కావాలని ఆ పార్టీ జాతీయ సంస్థాగత సం యుక్త కార్యదర్శి శివప్రకాశ్ జీ సూచించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కునేందుకు సంసిద్ధం కావాలని కోరారు. శాసనసభ ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై అందరి దృష్టినీ మళ్లించేందుకు సీఎం కేసీఆర్ పన్నుతున్న వ్యూహాల్లో చిక్కుకోకుండా, క్షేత్రస్థాయి నుంచి అన్నిరకాలుగా పార్టీ బలోపేతం కావాలని సూచించారు.
ఆది వారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ, ఓబీసీ మోర్చా జాతీ య అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, కార్యవర్గసభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శు లు మంత్రి శ్రీనివాస్, ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతిలతో శివప్రకాశ్ జీ సమావేశమయ్యారు. మధ్యాహ్నం రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలతో భేటీఅయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర యువ, మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మై నారిటీ, కిసాన్ మోర్చాల నేతలతో భేటీ అయ్యారు.
సమన్వయంతో వ్యవహరించాలి
రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు, ఇతరులంతా పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని శివప్రకాష్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా యావత్ పార్టీ యం త్రాంగం శ్రమించి పనిచేయాలని పిలుపునిచ్చారు.