షిఫ్ట్‌ పద్దతిలో మంత్రులు ఢిల్లీకి.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Bandi Sanjay Comments On Minister Ktr | Sakshi
Sakshi News home page

షిఫ్ట్‌ పద్దతిలో మంత్రులు ఢిల్లీకి.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mar 22 2023 12:42 PM | Updated on Mar 22 2023 3:47 PM

Bandi Sanjay Comments On Minister Ktr - Sakshi

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌పై మంత్రులు మాట్లాడటం లేదు కానీ.. కవిత కోసం మంత్రులు షిఫ్ట్‌ పద్దతిన ఢిల్లీ వెళ్లారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌పై మంత్రులు మాట్లాడటం లేదు కానీ.. కవిత కోసం మంత్రులు షిఫ్ట్‌ పద్దతిన ఢిల్లీ వెళ్లారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేపర్‌ లీకేజ్‌ కేసులో కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎలాంటి తప్పు చేయకపోతే సిట్టింగ్‌ జడ్జితో ఎందుకు విచారణ చేయించడం లేదు.. కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. యువత నిరాశకు గురికావొద్దు. మిలియన్‌ మార్చ్‌ తరహాలో నిరుద్యోగ మార్చ్‌ చేస్తామన్న బండి సంజయ్‌.. సిట్‌ నోటీసులపై స్పందిస్తూ.. తనకు నోటీసులు అందలేదని చెప్పారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ వద్ద ప్లెక్సీల కలకలం.. ఇచ్చట అన్ని పేపర్లు లభించును..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement