
వరదను మళ్లించేలా స్పిల్ వే కట్టకుండా.. కాఫర్ డ్యామ్‌లు పూర్తిచేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారు
చంద్రబాబు, దేవినేని ఉమా తప్పునకు విదేశాల్లో ఉరితీసే వారు
వీలైనంత త్వరగా పోలవరం పూర్తి
మంత్రి అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి : అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహానికి టీడీపీ అధినేత చంద్రబాబు జాతికి క్షమాపణ చెప్పాలని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే పూర్తిచేసి.. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టాకే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలన్నది కనీస పరిజ్ఞానమని.. కానీ, చంద్రబాబు.. స్పిల్ వే, ఎగువ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్‌లను ఒకేసారి ప్రారంభించి.. పూర్తి చేయలేక చేతులెత్తేశారని గుర్తుచేశారు. దాంతో గోదావరి ఉధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని.. దీనివల్ల రూ.400 కోట్లు గంగపాలైందని అన్నారు. ఈ కారణంగానే పోలవరం ప్రాజెక్టు జాప్యమవుతోందని వివరించారు. చంద్రబాబు, నాటి మంత్రి దేవినేని ఉమాలు చేసిన ఈ తప్పు మరో దేశంలో చేసి ఉంటే.. వారిద్దరినీ ఉరితీసి ఉండేవారన్నారు.
2018 నాటికే పూర్తిచేస్తామన్నారే..
పోలవరం ప్రాజెక్టును 2018 నాటికే పూర్తిచేసి.. జలాశయంలో నీటిని నిల్వచేసి అపర భగీరథుడిగా చంద్రబాబు నిలిచిపోతారు.. రాసుకో ‘సాక్షి’ పత్రికలో అని దేవినేని ఉమా అప్పట్లో సవాల్ విసరడాన్ని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. మరి 2018 నాటికి ఎందుకు పూర్తిచేయలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు.. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న చిత్తశుద్ధితో సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. అమలాపురం అల్లర్లలో పవన్ కల్యాణ్ పాత్ర ఉం దని ప్రజలంతా అనుకుంటున్నారని ఓ ప్రశ్నకు స మాధానంగా చెప్పారు. నిజంగా పవన్ కల్యాణ్ పా త్రే లేకపోతే ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగలబెడితే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.