ఇద్దరు కుమారులకు ఒక్కొక్కరికి మూడు ఎకరాల భూమి, ఇళ్ల స్థలం పంచి ఇచ్చిన. భర్తి చనిపోయిన తర్వాత కొంత భూమిని కౌలుకిచ్చుకొని బతుకుతున్న. వాటి పైసలు సైతం దురుసుగా దూషిస్తూ తీసుకొని వెళ్తున్నారు. హార్ట్ పేషంట్, దివ్యాంగురాలును. నా ఇద్దరు కుమార్తెలు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. పోషణభారం కష్టమవుతోంది.
– చొప్పరి రామ మల్లమ్మ, పూసాల
భూ ఆక్రమణలు అరికట్టండి
పెద్దపల్లిలోని బ్రాహ్మణకుంట సర్వే నం.1511లో ఎఫ్టీఎల్ స్థలం కబ్జాకు గురవుతోంది. కొందరు కుంటలో మట్టిపోసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మత్స్యకారులకు జీవనోపాధి దెబ్బతింటుంది. 68 ఎకరాల 28 గుంటల భూమిని రక్షించాలి. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. – కొలిపాక నర్సయ్య, బూతగడ్డ సంపత్, శ్రీనివాస్, గట్టయ్య, తిరుపతి, నర్సింగం, సారయ్య, రాజు, విద్యాసాగర్, ముందిరాజ్ సంఘం నాయకులు


