తండ్రికి తనయల కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

తండ్రికి తనయల కన్నీటి వీడ్కోలు

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

● మద్దిమల్లలో విషాదం ● మా నాన్నలా అర్ధంతరంగా వెళ్లొద్దు : రిషిక కన్నీటి విన్నపం

● మద్దిమల్లలో విషాదం ● మా నాన్నలా అర్ధంతరంగా వెళ్లొద్దు : రిషిక కన్నీటి విన్నపం

వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ కుటుంబానికి అతడే ఆధారం. ఆ పిల్లలకు అతడే సర్వస్వం. కానీ విధి ఆడిన నాటకంలో ఆ ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యారు. అనారోగ్యంతో తండ్రి మరణించగా.. కూతురే తండ్రికి తలకొరివి పెట్టి కన్నీటి వీడ్కోలు పలికిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లలో విషాదం నింపింది. మద్దిమల్లకు చెందిన కడవ శ్రీబాబు(35) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. శ్రీబాబుకు భార్య అనిత, ముగ్గురు కుమార్తెలు రిషిక(8వ తరగతి), లాస్య(7వ తరగతి), నిత్యశ్రీ(3వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణంతో ఆ కుటుంబం వీధినపడింది.

కలచివేసిన కూతుళ్ల రోదనలు

శ్రీబాబుకు కుమారులు లేకపోవడంతో పెద్దకూతురు రిషిక తలకొరివి పెట్టింది. తమకు అండగా ఉంటాడనుకున్న తండ్రి ఇలా మధ్యలోనే వదిలివెళ్లడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియల సమయంలో శ్రీబాబు పెద్దకుమార్తె రిషిక రోదించిన తీరు కలచివేసింది. ‘నాన్న.. ఒక్కసారి లేచి చూడు నాన్న. మేము ఎంత ఏడుస్తున్నామో. మా వంటి పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేయకండి.’ అంటూ రోదించిన తీరు కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement