5న గూడూరి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

5న గూడూరి పురస్కారం

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

● పురస్కారానికి ఎంపికై న స్వర్ణ కిలారి

● పురస్కారానికి ఎంపికై న స్వర్ణ కిలారి

సిరిసిల్ల అర్బన్‌: ప్రసిద్ధ తెలంగాణ కథా రచయిత గూడూరి సీతారాం యాదిలో గూడూరి ఫౌండేషన్‌–మారసం కథా పురష్కారం ఏటా అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే 2024 పురస్కారానికి రచయిత్రి, అనువాదకులు స్వర్ణ కిలారి రాసిన ‘నల్ల బంగారం’ కథల పుస్తకం ఎంపికై ందని గూడూరి ఫౌండేషన్‌ నిర్వాహకులు ఎలగొండ రవి, మారసం కార్యదర్శి ఆడెపుల లక్ష్మణ్‌ తెలిపారు. ఈ పురస్కారాన్ని 5 ఏప్రిల్‌, 2026న సిరిసిల్లలోని డాక్టర్‌ సినారె విజ్ఞాన మందిరం, జిల్లా గ్రంథాలయంలో జరిగే సభలో పురస్కారం ప్రధానం చేయనున్నారు. తెలంగాణ జీవితాలు, బొగ్గుబాయి బతుకులను ‘స్వర్ణ కిలారి’ నల్లబంగారం కథలుగా రాసినట్లు తెలిపారు. గతంలో ఈ పురస్కారాలు వరుసగా పూడూరి రాజిరెడ్డి, డాక్టర్‌ సూర్య ధనంజయ్‌, పిన్నమశెట్టి కిషన్‌ అందుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement