వేదనే మిగిలింది!
పెద్దపల్లిరూరల్: జిల్లాలో రెండ్రోజుల పాటు కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలతో రైతు ల కంటిమీద కునుకు లుఎండాపోయింది. చేతికి అందేదశలో పంట చేజారి పోతుందేమోనని ఆందో ళన వ్యక్తమవుతోంది. అకస్మాత్తుగా కురిసిన వానలకు పంట, పొలాలు నీటమునిగాయి. పైరు నేలవాలడం కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలోని పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు తదితర మండలాలతోపాటు మంథని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో వరి నేలవాలగా.. పత్తి చేలు నీటమునిగాయి.
దిగుబడిపై ప్రభావం..
జిల్లాలో వరి 2,11,780 ఎకరాల్లో సాగు కాగా, పత్తి 48,215 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 501 ఎ కరాలు, ఉద్యావన పంటలు 9వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అఽధికార వర్గాల ద్వారా తెలిసింది. పంట లు చేతికి అందే సమయంలో.. మంగళవారం రా త్రి, బుధవారం వానలు దంచికొట్టడంతో రైతులు దిగాలు పడ్డారు. నెలరోజుల క్రితం కూడా వరుసగా నాలుగు రోజులపాటు వర్షాలు కురిశాయి. దీంతో తెగుళ్లు సోకితే నివారణ చర్యలు చేపట్టామని, ఇప్పు డు దిగుబడి చేతికి అందేదశలో మరోసారి వరుణు డు ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చడంతో ఏంచేయా లో పాలుపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గి .. పెట్టుబడి కూడా వస్తుందో.. రాదోననే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయాధికారుల సర్వే
మోంథా తుపానుతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఏయే ప్రాంతాల్లో ఎంతమేర పంటలకు నష్టం జరిగిందనే విషయమై వివరాలను సేకరించేందుకు మండల వ్యవసాయాధికారులు, విస్తీర్ణాధికారులు ఊరూరా పర్యటిస్తూ సర్వే చేస్తు న్నారు. పూర్తివివరాలు ఇంకా రాలేదని, శనివారం వరకు సమగ్ర సమాచారం సేకరిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు.
కట్టలుగా కడితే మేలు..
బలమైన ఈదురుగాలులు, వర్షం ధాటికి నేలవాలిన వరి పైరును పైకి నిటారుగా నిల్చొబెట్టి.. కట్టలుగా కట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పొలంలో నీరు నిల్వఉండి నేలవాలితే గింజలు తడిసి రంగుమారి, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. వీలైనంత మేరకు కట్టలుగా కట్టి పంటను కాపాడుకోవాలని వ్యవసాయాధికారులు తెలిపారు.
వరి 2,11,780
పత్తి 48,215
మొక్కజొన్న 501
ఉద్యానవన 9,000
జిల్లాలో సాగు వివరాలు(ఎకరాల్లో)
వేదనే మిగిలింది!


