దేశ సమగ్రతను కాపాడాలి
పెద్దపల్లి: దేశ సమగ్రతను కాపాడాలని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్‌లో శుక్రవారం సర్ధార్ వల్లభాయ్ చి త్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. క లెక్టర్ మాట్లాడుతూ, దేశప్రజలు భారతీయులనే భావనను సుస్థిరం చేసిన మహనీయుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. అనంతరం పోలీస్ శా ఖ చేపట్టిన 2కే రన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, ఏవో శ్రీనివాస్, వైద్యాధికారి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఐదురోజుల పాటు వరి కోతలు వద్దు
జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వ చ్చే 5రోజులపాటు రైతులు వరికోతలు చేపట్టవద్దని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇదివరకే వరి కోసిన రై తులు వడ్లపై టార్పాలిన్ కవర్లు కప్పుకొని సంరక్షించుకోవాలని, తడిసిన వడ్లు వివరాలను వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
భూభారతి దరఖాస్తులు పరిష్కరించండి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): భూభారతి దరఖా స్తు లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహీసీల్దార్ కార్యాలయాన్ని ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు. 134 ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు వచ్చాయని, అందులో 110 ఇళ్ల నిర్మా ణం ప్రారంభమైందని, మిగతావా పనులు ప్రాంభించి వేగవంతంగా పూపూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. డిప్యూటీ కలెక్టర్ వనజ, తహసీల్దార్ జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి
ఓదెల(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వే గవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో, తహసీత్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీని కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు. డిప్యూటి కలెక్టర్ వనజ, ఎంపీడీవో తిరుపతి, తహసీల్దార్ ధీరజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
పెద్దపల్లి: తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయా లని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. తాగునీటి సరఫరాపై వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమైక్యతకు పాటుపడాలి
గోదావరిఖని: దేశ సమగ్రతకోసం కోసం అందరూ పాటుపడాలని రామగుండం పోలీస్ క మిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నగరంలో చేపట్టిన రన్‌ఫర్ యూనిటీలో ఆయ న మాట్లాడారు. ప్రజల్లో జాతీయ ఐక్యత, సా మరస్యం, దేశభక్తి, సమైక్యతాభావంపై అవగాహన కల్పించడమే రన్ లక్ష్యమన్నారు. సర్ధార్‌వల్లభాయ్ పటేల్ సేవలు ప్రతీ ఒక్కరికి ప్రేర ణ అని అన్నారు. రజాకార్లను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసి.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా సర్ధార్ వల్లభాయ్‌పటేల్ సేవలు అందించారని సినీ నటుడు సా గర్ అన్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు రమేశ్, శ్రీనివాస్, ప్రతాప్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్‌కుమార్, రాజేశ్వర్‌రావు, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, వా మనమూర్తి, శేఖర్, మల్లేశం, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
దేశ సమగ్రతను కాపాడాలి


