అయ్యప్పస్వామి శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

అయ్యప్పస్వామి శోభాయాత్ర

Nov 1 2025 8:18 AM | Updated on Nov 1 2025 8:18 AM

అయ్యప

అయ్యప్పస్వామి శోభాయాత్ర

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): పాండవులగుట్టపై చేపట్టిన అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించిన స్వామివారి విగ్రహాలతో శుక్రవారం పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించా రు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పెద్దిరెడ్డి వీరారెడ్డి, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఇమ్మడి జ్యోతి, రాఘవులు, అశోక్‌ పాల్గొన్నారు.

4న జాబ్‌మేళా

పెద్దపల్లి: నిరుద్యోగు కోసం ఈనెల 4న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్‌ తెలిపారు. మెడ్‌ప్లస్‌ కంపెనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. 40 ఫార్మసిస్ట్‌, 50 ఫార్మసిస్ట్‌ ఏఐడీ, 100 జూనియ ర్‌ అసిస్టెంట్‌, 30 ఆడిట్‌ అసిస్టెంట్‌, 20 సీఎస్‌ఏ, 1 డెలీవరీ బాయ్‌, 1 సెక్యూరిటీగార్డు, 1 హౌస్‌ మెయిడ్‌ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయన్నా రు. ఆసక్తి, అర్హత గలవారు ఉదయం 11 గంట ల సర్టిఫికెట్‌ జిరాక్స్‌లతో కలెక్టరేట్‌లోని రూమ్‌ నంబరు 225లో సంప్రదించాలని ఆయన సూచించారు. వివరాలకు 93923 10323, 89853 36947, 81212 62441 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

ఫోన్‌కాల్స్‌కు స్పందించాలి

పెద్దపల్లి: జిల్లాలోని 108 వాహనానికి వ చ్చే అత్యవసర ఫోన్‌ కాల్స్‌కు వెంటనే స్పందించాలని అంబులెన్స్‌ జిల్లా ప్రో గ్రామింగ్‌ మేనేజర్‌ జనార్దన్‌ సూచించా రు. సుల్తానాబాద్‌లోని కార్యాలయంతోపాటు 108 అంబులెన్స్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యపరికరాలు, వాహనం పనితీరుపై ఆరా తీ శారు. ప్రత్యేక శ్రద్ధతో పేషంట్లను ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఎమర్జెన్సీ మెడిక ల్‌ టెక్నీషియన్‌ ఇరుగురాల రవివర్మ, పైలెట్‌ కా రంగుల సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

బిల్లులు చెల్లించకుంటే సమ్మె

పెద్దపల్లి: మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వారంరోజుల్లోగా పెండింగ్‌ బిల్లులు చెల్లించ కుంటే సమ్మెలో చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసల రమేశ్‌ హెచ్చరించా రు. కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం డీఈవో మాధవికి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ 7నెలల నుంచి పూర్తిస్థాయి బిల్లులు చెల్లించడం లేదన్నారు. బకాయిలు చెల్లించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నా యకులు బండారి వసంత, మేకల యశోద, పా ఠకుల కళావతి, పిడుగు గట్టయ్య, పద్మ, లంక విజయ, రావిశెట్టి సరూప, ధరణి, సుమలత, లక్ష్మణ్‌, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఇందిర సేవలు మరువలేనివి

పెద్దపల్లిరూరల్‌: భారత మాజీప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్‌ పా ర్టీ నాయకులు అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆ మె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు సురేశ్‌గౌడ్‌, ఈర్ల స్వ రూప, సంపత్‌, శ్రీకాంత్‌, అమ్రేశ్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్‌, ఫణీంద్ర, రాజయ్య, సంతోష్‌, సమ్మ య్య, నదీం, హకీం, ఫిరోజ్‌ఖాన్‌ ఉన్నారు.

అన్నదాతలను ఆదుకోవాలి

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): తుపానుతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డి మాండ్‌ చేశారు. రేగడిమద్దికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎకరాకు రూ.40వేల చొప్పున బాధి త రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. నా యకులు అర్జున్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, మహేందర్‌, ప్రదీప్‌కుమా ర్‌, కందుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్పస్వామి శోభాయాత్ర1
1/4

అయ్యప్పస్వామి శోభాయాత్ర

అయ్యప్పస్వామి శోభాయాత్ర2
2/4

అయ్యప్పస్వామి శోభాయాత్ర

అయ్యప్పస్వామి శోభాయాత్ర3
3/4

అయ్యప్పస్వామి శోభాయాత్ర

అయ్యప్పస్వామి శోభాయాత్ర4
4/4

అయ్యప్పస్వామి శోభాయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement