ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే చర్యలు
కోల్‌సిటీ(రామగుండం): నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తుసామగ్రి విక్రయిస్తే చర్యలు తప్పవని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ డిప్యూ టీ కమిషనర్ వెంకటస్వామి హెచ్చరించారు. బల్ది యా కార్యాలయంలో టోకు వ్యాపారులతో శుక్రవా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరంలో సింగిల్‌యూస్ ప్లాస్టిక్ వస్తుసామగ్రి విక్రయాల నియంత్రణకు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఈవిషయంపై వ్యాపారులకు తొలుత అవగాహన కల్పించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంతో అనేక అనర్థాలు జరుగుతాయన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నగరానికి రవాణా అవుతున్న నిషేధిత ప్లాస్టిక్ సా మగ్రి గురించిన సమాచారం తకు అందజేసి సహకరించాలని ఆయన కోరారు. కాగా, తమకు మూడు రోజులు గడువు ఇవ్వాలని టోకు వ్యాపారులు విన్నవించగా.. ఆ తర్వాత నిషేధిత ప్లాస్టిక్ సామగ్రి విక్రయించబోమని హామీపత్రం రాసి ఇచ్చారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మెప్మా టీఎంసీ మౌనిక, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, సంపత్, సీనియర్ అసిస్టెంట్లు కల్‌రామ్, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.


