ఫలించిన ఏడేళ్ల పోరాటం
సర్ఫేస్‌లోకి మైనింగ్ స్టాఫ్, టెక్నీషియన్లు సేమ్‌జాబ్ ఇచ్చేందుకు అంగీకారం ఒప్పందం కుదుర్చుకున్న గుర్తింపు సంఘం ఏఐటీయూసీ
గోదావరిఖని: సింగరేణిలోని ఈపీ ఆపరేటర్లు, మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్ ఏడేళ్ల పోరాటం ఫ లించింది. అనారోగ్య కారణాలతో అండర్‌గ్రౌండ్‌లో అన్‌ఫిట్ అయితే ఉపరితలంలో సేమ్ డిజిగ్నేషన్‌తో ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించింది. సంస్థ వ్యాప్తంగా 2018 నుంచి 2025వ సంవతసరం వరకు అండర్‌గ్రౌండ్‌లో అన్‌ఫిట్‌అయి సర్ఫేస్‌లో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వారికి తాజా ఒప్పందం వర్తించనుంది. ఈపీ ఆపరేటర్లు, మైనింగ్ స్టాఫ్‌లో ఓవర్‌మెన్, సర్థార్‌లు, షార్ట్‌ఫైరర్లు, టెక్నీషియన్ వి భాగంలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిక్ కార్మికులు ఈ ఒప్పందంలోకి వ స్తా రు. సుమారు 74 మందికి దీనిద్వారా ప్రయోజనం చేకూరుతుందని యాజమాన్యంతోపాటు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చెబుతున్నాయి. మెడికల్ టెస్ట్ నిర్వహించి సేమ్‌జాబ్ లోకి తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
దరఖాస్తుల ఆహ్వానం..
సింగరేణి సంస్థ వ్యాప్తంగా పనిచేస్తున్న ఎలక్ట్రికల్, మెకానికల్, చార్జ్‌హ్యాండ్, ఫోర్‌మెన్‌ఇన్‌చార్జి, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్‌లు మె డికల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం కోరింది. ఈమేరకు అన్నిఏరియాలకు ఉత్తర్వు జారీచేసింది. ఈనెలాఖరులోగా దరఖాస్తులు తమకు పంపించాలని సూచించింది. వీరితోపాటు ఈపీ ఆపరేటర్లు కూడా దరఖాస్తు చేయాల్సి ఉందని చెబుతోంది.


